కారణ జన్ముడు - తారక రాముడు
ఎన్టీఆర్ జాతకం చూసిన ఏ జ్యోతిష్యునికైనా ఇది సాధారణ జాతకం కాదని ఇట్టే
తెలిసిపోతుంది. ఒక జ్యోతిష్యునిగా నా అభిప్రాయం ప్రకారం అది కొట్లలో ఒకరికుండే
మహర్జాతకం.
ఎన్టీఆర్ జీవితంలో ఎన్నో అద్భుత సంఘటనలు, ఆశ్చర్యకర విషయాలు ఎన్నో జరిగాయి. అవన్నీ
కూడా ఎన్టీఆర్ ని ఒక మానవాతీత వ్యక్తిగానే నిలుపుతాయి. ఎన్టీఆర్ జీవితంలో జరిగిన అసాధారణ సంఘటనలు అతనినొక అసాధారణ వ్యక్తిగానే
నిలుపుతాయి. ఎన్టీఆర్ కారణజన్ముడు అనటానికవే ప్రత్యక్ష నిదర్శనాలు.
ఇంకో వేశేషమేమంటే భవిష్య కాలాన్ని మన కళ్ళముందు నిలిపిన శ్రీ వీరబ్రహ్మేంద్ర
స్వామి గారు తమ కాలజ్ఞాన తత్వాల్లో ఎన్టీఆర్ గురించి ప్రస్తావించటం. ముగ్గురు
రాములు (ఎన్టీఆర్ -ఆంధ్రప్రదేశ్, ఎమ్.జి. రామచంద్రన్-తమిళనాడు, రామకృష్ణ హెగ్డే -
కర్నాటక) ఏక కాలాన దక్షిణ భారతాన్ని పరిపాలిస్తారని తెలిపారు.
అభిమాన జనానికి ఎన్టీఆర్ యుగపురుషుడు - కారణ
జన్ముడు. ఆయనను ప్రత్యక్ష దైవం లా కొలచి ఆరాధించిన, ఆరాధిస్తున్న వారు నేటికీ
కొకొల్లలు.
ఆ కారణ జన్ముడు జన్మించిన ఈ పుణ్యదినం (May 28) అభిమానులకే కాదు ఆయన సేవ, ప్రేమాభిమానాలందుకున్న ప్రతి ఒక్కరికీ పర్వదినమే.
No comments:
Post a Comment
Note: only a member of this blog may post a comment.